మలయాళ స్టార్ మమ్ముట్టి డిఫరెంట్ జోనర్ సినిమాలతో సౌత్ ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఆయన బర్త్ డే సందర్భంగా అస్సలు మిస్ అవ్వకూడని సినిమాలపై ఓ లుక్కేయండి.

రజినీకాంత్‌తో కలిసి మమ్ముట్టి నటించిన తమిళ చిత్రం ‘దళపతి’ ఒక క్లాసిక్ సినిమాగా నిలిచిపోయింది.

1992లో విడుదలయిన తెలుగు చిత్రం ‘స్వాతి కిరణం’లో మమ్ముట్టి ఒక స్పెషల్ క్యారెక్టర్ చేశారు.

‘డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్’ సినిమాలో టైటిల్ పాత్రలో కనిపించిన మమ్ముట్టి తన నటనతో ఆడియన్స్‌ను ఆకట్టుకున్నారు.

మమ్ముట్టిలోని టాలెంట్‌ను పూర్తిస్థాయిలో బయటపెట్టిన చిత్రాల్లో ‘పెరంబు’ ఒకటి.

‘యాత్ర’ మూవీలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి పాత్రలో నటించి తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యారు మమ్ముట్టి.

జ్యోతికతో జతకడుతూ మమ్ముట్టి నటించిన ‘కాథల్’ మూవీ దేశవ్యాప్తంగా సెన్సేషన్ క్రియేట్ చేసింది.

ఇటీవల కాలంలో విడుదలయిన ‘భ్రమయుగం’ మమ్ముట్టి స్టోరీ సెలక్షన్ ఎలా ఉంటుందో ప్రేక్షకులకు తెలిసేలా చేసింది.

73వ ఏట అడుగుపెట్టినా కూడా ఇప్పటికీ చేతినిండా సినిమాలతో బిజీగా ఉన్నారు ఈ మలయాళ సూపర్ స్టార్.

గౌతమ్ మీనన్ దర్శకత్వంలో మమ్ముట్టి నటిస్తున్న ‘డామినిక్ అండ్ ది లేడీస్ పర్స్’ మూవీ పోస్టర్ ఆయన పుట్టినరోజు సందర్భంగా విడుదలయ్యింది.