నో వైట్ డైట్ గురించి మీకు తెలుసా.. తెలియకపోతే తెలుసుకోండి

తెలుపురంగులో ఉండే ఆహార పదార్థాలను తినకుండా ఉండటమే

షుగర్ లెవల్స్ కంట్రోల్ లో ఉండటంతో పాటు బరువు కూడా పెరగరు.

మైదాతో చేసే వైట్ బ్రెడ్ లో పోషకాలు నిల్. పీచు, ప్రొటీన్ కూడా ఉండవు.

వైట్ బ్రెడ్ లో కార్బోహైడ్రేట్లు మాత్రమే ఉంటాయి.

మీకు శాండ్ విచ్ తినే అలవాటుంటే కూరగాయలెక్కువ, బ్రెడ్ తక్కువ తీసుకోవాలి.

పాలిష్ బియ్యం. వీటిలోనూ పోషకాలకంటే కేలరీలు, కార్బోహైడ్రేట్లే అధికం.

దంపుడు బియ్యం లేదా బ్రౌన్ రైస్ తినడం మంచిది.

వైట్ రైస్ కు బదులు క్వినోవా, కొర్రల అన్నం, గోధుమ గటిక, జొన్న గటిక మంచి ఆహారాలు.

పంచదారను మానుకోవాలి. బ్రౌన్ షుగర్, తేనె, మాపుల్ సిరప్ వంటి వాటిని తినకూడదు.

తెల్లగా ఉండే ఉప్పుకు స్వస్తి చెప్పండి. ఒబేసిటీ, కిడ్నీ, గుండె సమస్యలు వస్తాయి.

పింక్ సాల్ట్, బ్లాక్ సాల్ట్, బ్లూ సాల్ట్ ను వాడటం బెటర్.

బంగాళదుంపల్లోనూ విటమిన్ సి, పొటాషియం, పీచు ఉంటాయి. కానీ కారోహైడ్రేట్లూ అధికమే.

బంగాళదుంపలతో చేసే వంటకాలకు కాస్త దూరంగా ఉండండి.