నిమ్మకాయ పోషకాల పవర్‌ హౌస్. నిమ్మలో ప్రోటీన్‌, కొవ్వు, విటమిన్‌ సి, కాల్షియం,వంటి పోషకాలు ఉంటాయి.

నిమ్మరసం తాగడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి.

నిమ్మ రోగనిరోధక శక్తిని మెరుగుపరుస్తుంది. గుండె జబ్బల ముప్పును తగ్గిస్తుంది.

నిమ్మ శరీర కణజాలం పెరుగుదల, అభివృద్ధికి దోహదం చేస్తుంది.

Fill in some text

నిమ్మరసంలో విటమిన్‌ సి పుష్కలంగా ఉంటుంది. ఇది శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్‌గా పనిచేస్తుంది.

నిమ్మరసం మూత్రంలో సిట్రేట్‌ స్థాయిలను పెంచి.. మూత్రపిండాల్లో రాళ్లను నివారిస్తుంది.

నిమ్మరసంలో పెక్టిన్‌ అనే కరిగే ఫైబర్‌ పుష్కలంగా ఉంటుంది. ఇది లివర్‌లో జీర్ణ ఎంజైమ్‌ల ఏర్పాటుకు ప్రోత్సహిస్తుంది.

నిమ్మరసంలో ఫైబర్‌ మెండుగా ఉంటుంది. ఇది రక్తంలో గ్లూకోజ్‌‌ని అదుపులో ఉంచుతుంది.

నిమ్మరసం తీసుకుంటే డయాబెటిస్‌ వచ్చే ముప్పు తగ్గుతుంది.

షుగర్‌ పేషెంట్స్‌ రోజూ నిమ్మరసం తాగితే.. రక్తంలో చక్కెర స్థాయిలు కంట్రోల్‌లో ఉంటాయి.

నిమ్మకాయలో పెక్టిన్ ఉంటుంది. నిమ్మరసం మీకు కడుపు నిండిన అనుభూతిని ఇస్తుంది.