స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ లావా తన స్పీడు పెంచింది. తాజాగా ఓ కొత్త స్మార్ట్‌ఫోన్‌ను తీసుకొచ్చింది.
కంపెనీ ఈ స్మార్ట్‌ఫోన్‌ను కేవలం ఒకే వేరియంట్లో మాత్రమే ప్రవేశపెట్టింది.
ఈ ఫోన్ 4GB RAM + 64GB స్టోరేజ్ వేరియంట్ రూ.6,499 ధరతో రిలీజ్ అయింది.
వైట్, బ్లాక్, లావెండర్ కలర్ ఆప్షన్లలో వస్తుంది. వినియోగదారులు ఈ స్మార్ట్‌ఫోన్‌ను ఆన్లైన్, ఆఫ్‌లైన్‌లో కొనుగోలు చేయవచ్చు.
కంపెనీ Lava Yuva Starలో 6.75 అంగుళాల IPS LCD డిస్ప్లేను అందించింది. ఇది 60Hz రిఫ్రెష్ రేట్‌కు మద్దతు ఇస్తుంది.
వాటర్‌డ్రాప్ నాచ్ కూడా ఇందులో అందుబాటులో ఉంటుంది. ప్రాసెసర్ విషయానికొస్తే.. ఈ మొబైల్ UniSoC 9863A ప్రాసెసర్‌లో పని చేస్తుంది.
లావా ఫోన్ Android GO ఎడిషన్‌లో పని చేస్తుంది. ఇది డ్యూయల్ రియర్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంది.
దీని ప్రైమరీ లెన్స్ 13MPగా ఉంది. Lava Yuva Starలో AI సెకండరీ కెమెరా ఉపయోగించబడింది.
ఈ ఫోన్లో LED ఫ్లాష్ కూడా అందుబాటులో ఉంది. సెల్ఫీ, వీడియో కాలింగ్ కోసం ఇది 5MP ఫ్రంట్ కెమెరాను కలిగి ఉంది.
ఈ ఫోన్ 5,000mAh బ్యాటరీని కలిగి ఉంది. ఇది 10 వాట్ల ఛార్జింగ్‌కు మద్దతు ఇస్తుంది.
అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే.. ఇది 4G కనెక్టివిటీ సపోర్ట్‌తో వస్తుంది.