కర్ణాటకకు చెందిన ఫ్యామిలీ అయినా కూడా పూజా హెగ్డే పుట్టి పెరిగిందంతా ముంబాయ్‌లోనే. తను 1990 అక్టోబర్ 13న జన్మించింది.

హాట్ బ్యూటీ పూజా హెగ్డే పుట్టినరోజు సందర్భంగా తన గురించి ఈ ఇంట్రెస్టింగ్ విషయాలపై ఓ లుక్కేయండి.

పూజా హెగ్డేకు మంగళూరుకు డిష్ అయిన కోరీ రొట్టీ అంటే చాలా ఇష్టమని స్వయంగా తానే ప్రకటించింది.

మోడలింగ్‌లో అడుగుపెట్టిన పూజా.. 2010లో మిస్ యూనివర్స్ ఇండియా పోటీలో పాల్గొని సెకండ్ రన్నరప్‌గా నిలిచింది.

పూజా తులు ఫ్యామిలీకి చెందినది కావడంతో తనకు ముందు నుండే ఆ భాష వచ్చు. దాంతో పాటు హిందీ, తెలుగు, ఇంగ్లీష్, తమిళ భాషల్లో కూడా మాట్లాడగలదు.

2016లో హృతిక్ రోషన్ హీరోగా నటించిన ‘మొహంజోదారో’లో హీరోయిన్‌గా నటించి బాలీవుడ్‌లో అడుగుపెట్టింది పూజా.

చిన్నప్పటి నుండి పూజాకు డ్యాన్స్ అంటే చాలా ఇష్టం. తను భరతనాట్యంలో ట్రైనింగ్ కూడా తీసుకుంది.

ట్రావెలింగ్, అడ్వెంచర్స్ అంటే కూడా పూజాకు చాలా ఇష్టం. అంతే సమయం దొరికినప్పుడల్లా ప్రపంచాన్ని చుట్టేయడానికి సిద్ధపడుతుంది.

పూజా హెగ్డే ఫ్యాషన్ సెన్స్‌కు చాలా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. తనలాగా రెడీ అవ్వాలని చాలామంది అమ్మాయిలు అనుకుంటూ ఉంటారు.

చాలాకాలం సినిమాల నుండి దూరంగా ఉన్న తర్వాత ‘దళపతి 69’తో గట్టి కమ్‌బ్యాక్‌కు సిద్ధమయ్యింది పూజా హెగ్డే.