కివీ పండ్లు రుచితోపాటు పోషక విలువలు కూడా మెండుగా ఉంటాయి. కివీలో విటమిన్ సి ఉంటుంది. ఇది శరీరం రోగనిరోధక శక్తిని పెంచుతుంది.

కివీలో పాలీఫెనాల్స్, కెరోటినాయిడ్స్ వంటి యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఈ యాంటీఆక్సిడెంట్లు ఫ్రీ రాడికల్స్‌తో పోరాడి, శరీరంలో మంటను తగ్గిస్తాయి.

ప్రతి రోజూ కివీ తినడంతో సీజనల్‌ వ్యాధుల బారిన పడకుండా కాపాడుకోవచ్చు.

కివీ పండుతో బరువును కూడా అదుపులో ఉంచుకోవచ్చు.

ఈ పండ్లలో పీచుపదార్థాలు ఎక్కువగా.. కేలరీలు తక్కువగా ఉంటాయి. ఇది ఆకలిని తగ్గించి బరువు పెరగకుండా చేస్తుంది.

జీర్ణ సమస్యలతో బాధపడతున్న వారు కివీని తప్పకుండా తినాలి. కివీఫ్రూట్‌లోని డైటరీ ఫైబర్ పేగు ఆరోగ్యం మెరుగుపడుతుంది.

కివీలోని విటమిన్ సి, యాంటీఆక్సిడెంట్లు చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.

ఈ పండు పొట్టను శుభ్రపరుస్తుంది. మలబద్ధకం సమస్యను నివారిస్తుంది.

Fill in some text

కివీలోని పోషకాలు మచ్చలు, మొటిమల సమస్యలను తగ్గిస్తుంది. ఈ పండులోని ఎలక్ట్రోలైట్స్ రక్తపోటును అదుపులో ఉంచుతాయి.

కివీ తినడంతో నిద్ర మెరుగుపడుతుంది. ఈ పండులో విటమిన్ కె ఉంటుంది. ఇది ఎముకల ఆరోగ్యాన్ని కాపాడుతుంది.