ఐఫోన్ 16 సిరీస్‌లోని iPhone 16, iPhone 16 Plus, iPhone 16 Pro, iPhone 16 Pro Max వంటి మోడల్‌లు ఇవాళ సేల్‌కు వచ్చాయి.

భారతదేశంలోని Apple Saket, Apple BKCలో, అలాగే గుర్తింపు పొందిన రిటైల్ స్టోర్‌లలో వీటిని కొనుక్కొని ఇంటికి పట్టికెళ్లొచ్చు.

ఇందులో iPhone 16 బేస్ 128GB స్టోరేజ్‌ వేరియంట్ రూ.79,900 నుండి ప్రారంభమవుతుంది.

అదే సమయంలో iPhone 16 Plus బేస్ 128GB వేరియంట్‌ రూ.89,900 నుండి అందుబాటులో ఉంది.

అంతేకాకుండా ఈ మోడళ్లు 256GB, 512GB స్టోరేజ్ ఆప్షన్‌లలో అందుబాటులో ఉన్నాయి. 

అదే సమయంలో iPhone 16 Pro బేస్ 128GB స్టోరేజ్‌ వేరియంట్ ధర రూ.1,19,900గా ఉంది.

అలాగే iPhone 16 Pro Max మిడ్ రేంజ్ 256GB స్టోరేజ్ వేరియంట్ రూ.1,44,900 నుండి ప్రారంభమవుతుంది.

వీటితో పాటు ఫోన్‌లను 512GB, 1TB స్టోరేజ్‌తో కూడా కొనుగోలు చేయవచ్చు.

భారీ బ్యాంక్ డిస్కౌంట్లు కూడా పొందుతారు. American Express, Axis Bank, ICICI బ్యాంక్ కార్డ్‌లపై రూ.5,000 తక్షణ తగ్గింపును పొందవచ్చు.

3 లేదా 6 నెలల నో కాస్ట్ EMIని అందిస్తోంది. ఇంకా రూ.67,500 వరకు ఎక్స్ఛేంజ్ డిస్కౌంట్ పొందవచ్చు.