ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన చెట్టు గురించి మీకు తెలుసా?..

ఈ ప్రపంచంలో అత్యంత ఎత్తైన వృక్షం పేరు హైపిరియాన్.

హైపిరియాన్ ఒక కోస్ట్ రెడ్ వుడ్ అంటే సెకోయియా సెంపెవిరేన్స్ జాతికి చెందిన చెట్టు.

దీని ఎత్తు 115.92 మీటర్లు అంటే 380.1 అడుగులు. ఆగస్టు 2006లో దీన్ని కనుగొన్నారు.

క్యాలిఫోర్నియాలోని రెడ్ వుడ్ నేషనల్ పార్క్ లో హైపిరియాన్ చెట్టు ఉంది.

అమెరికాలోని స్టాట్యూ ఆఫ్ లిబర్టీ (93 మీటర్లు), లండన్ బిగ్ బిన్ (96 మీటర్లు) కంటే దీని ఎత్తు ఎక్కువ.

హైపీరియాన్ వయసు 600-800 ఏళ్లు అని అంచనా. ఈ జాతి చెట్లు 2000 ఏళ్ల దాకా జీవిస్తాయి.