భారత ఫుట్ బాల్ చరిత్రలో సునీల్ ఛెత్రికి తిరుగులేని రికార్డు ఉంది

ఇప్పటివరకు 150 మ్యాచుల్లో 94 గోల్స్ చేసి ఆసియాలో అత్యధిక గోల్స్ చేసిన ఆటగాళ్లలో రెండో స్థానంలో నిలిచాడు

ఆసియా నుంచి ఇరాన్ ఫుట్ బాలర్ అలీ డేయ్ 148 మ్యాచుల్లో 109 గోల్స్ చేసి మొదటి స్థానంలో నిలిచాడు

ప్రపంచ ఫుట్ బాల్ చరిత్రలో సునీల్ ఛెత్రి అత్యధిక గోల్స్ చేసిన ఆటగాళ్ల జాబితాలో నాలుగో స్థానంలో ఉన్నాడు

ఈ మధ్యే మలేషియా ఆటగాడు మోక్తార్ దహారిని దాటేసిన సునీల్ ఛెత్రి నాలుగో స్థానానికి  ఎగబాకాడు

ప్రస్తుతం అంతర్జాతీయ ఫుట్ బాల్ మ్యాచులు ఆడుతున్న ఆటగాళ్ల జాబితాలో సునీల్ ఛెత్రి 94 గోల్స్ తో 3వ స్థానంలో ఉన్నాడు

క్రిస్టియానో రొనాల్డో(128 గోల్స్), మెస్సీ(106 గోల్స్) మాత్రమే సునీల్ ఛెత్రి కంటే ముందున్నారు

2021లో ఖేల్ రత్న అవార్డ్ గెల్చుకున్న తొలి ఫుట్ బాలర్‌గా చరిత్ర సృష్టించాడు

అమెరికన్ ఫుట్ బాల్ లీగ్‌లో ఆడిన తొలి ఇండియన్ ఫుట్ బాలర్‌గా చరిత్ర పుటల్లో నిలిచాడు సునీల్ ఛెత్రి

మొత్తంగా 365 మ్యాచుల్లో 158 గోల్స్ చేసిన ఫుట్ బాల్ లెజెండ్ సునీల్ ఛెత్రి రిటైర్మెంట్ ప్రకటించాడు