వర్షాకాలంలో ముఖంపై మేకప్ రక్షించుకోవడానికి కొన్ని సింపుల్ టిప్స్ పాటిస్తే రోజంతా ముఖంపై మేకప్ చెక్కు చెదరకుండా ఉంటుంది

ముఖానికి మేకప్‌ వేసుకునే ముందుగా ప్రైమర్‌ను తప్పకుండా అప్లై చేయాలి. ప్రైమర్ చర్మంపై మృదువైన ఓ బేస్‌ను క్రియేట్ చేస్తుంది.

సీజన్‌ను బట్టి వాడాల్సిన ఫౌండేషన్లు మార్కెట్లో పుష్కలంగా దొరుకుతుంటాయి. అందులోను తేమ తగిలినా కూడా చర్మంపై మేకప్‌ను నిలిపే ఫౌండేషన్‌ను ఎంచుకోవాలి.

మార్కెట్లో ప్రస్తుతం వాటర్ రెసిస్టెంట్ ఐషాడో, ఐలైనర్లు దొరుకుతున్నాయి. వీటిని ఉపయోగిస్తే ముఖంపై ఐ మేకప్ ఎక్కువ సమయం పాటు నిలిచి ఉంటుంది.

వర్షాకాలంలో ఉపయోగించే లిప్‌స్టిక్‌లలో బోల్డ్ షేడ్స్ ఉపయోగించడం వల్ల సౌకర్యంగా ఉంటుంది.

చర్మానికి మేకప్ వేసిన అనంతరం పౌడర్ వాడడం వల్ల మేకప్ చెక్కుచెదరదు. ముఖం జిడ్డుగా మారకుండా ఉండాలంటే పౌడర్ తప్పనిసరి వాడాలి.

ఫైనల్‌గా మేకప్ వేసుకున్న అనంతరం స్ప్రేతో దాన్ని సెట్ చేసుకోవాలి. రోజంతా మేకప్ తేమను తట్టుకుని ఉండాలంటే సెట్టింగ్ స్ప్రే అవసరం.