మిరపకాయ బజ్జీని తెలుగు ప్రజలు బాగా ఇష్టపడుతుంటారు

ఇది పచ్చి మిరపకాయలను, పిండిని వేయించి తయారు చేసే స్ట్రీట్ ఫుడ్ స్నాక్

ఈ మిర్చి బజ్జీలో అనేక రకాలు ఉంటాయి

వానా కాలంలో మిరపకాయ బజ్జీని ఎక్కువగా తీసుకుంటుంటారు

వర్షం కురుస్తున్న సమయంలో వేడివేడి మిర్చి బజ్జీలను తింటూ తెగ ఆనందపడుతారు

అవసరంమేరా శెనిగ పిండి, బియ్యపు పిండిని ఒక పాత్రలో తీసుకుంటారు

వాటిలో ఉప్పు, కారం, పసుపు, సోడా తగిన మోతాదులో వేసి బాగా కలుపుతారు

ఆ తరువాత మిర్చీని రెండుగా చీల్చి అందులో చిక్కని చింతపండు గుజ్జును చేర్చుతారు

ఆ తరువాత ఆ మిర్చీని ఆ పిండిలో ముంచి, ఆ తరువాత వేడి నూనెలో కాల్చుతారు

ఈ విధంగా మిర్చీ బజ్జీలను తయారు చేస్తారు.