కమ్యూనికేషన్ స్కిల్స్ పెరగాలంటే ఏం చేయాలి..?

ప్రస్తుత ప్రపంచంలో కమ్యూనికేషన్ స్కిల్స్ చాలా అవసరం. ఈ స్కిల్స్ లేక చాలామంది బాధపడుతుంటారు. వాటికి సంబంధించిన పలు విషయాలు..

ఎదుటి వ్యక్తి చెప్పేది చాలా ముఖ్యం. ఏ మనిషి కమ్యూనికేషన్ బాగుండాలన్నా ఫస్ట్ చేయాల్సింది సరిగా వినడం. మధ్యలో వేరే ఆలోచనలు రానీవ్వవద్దు. వారు ఎలా మాట్లాడుతున్నారో గమనిస్తూ ఉండాలి.

ఎదుటివ్యక్తి ఏం చెబుతున్నారో అర్థం చేసుకోవాలి. ఎల్లప్పుడూ వారి ఒపినీయన్ ను అంగీకరిస్తున్నట్లు ఉండాలి. దీని వల్ల మీరు వారి భావోద్వేగానికి మంచిగా కనెక్ట్ అవుతారు.

ఇతరులతో మాట్లాడేటప్పుడు కోపం, చిరాకు, బాధ ఇలాంటివి ఎట్టి పరిస్థితుల్లో మీ ముఖంలో కనిపించకూడదు.

నలుగురితో మాట్లాడేటప్పుడు ఆత్మవిశ్వాసం చాలా ముఖ్యం. మీరు మీ కాన్ఫిడెన్స్ ను కోల్పోతే చెప్పే విషయం సరిగ్గా చెప్పలేరు.

ఎవరికైనా చెప్పేటప్పుడు వారికి అర్థమయ్యే రీతిలో చెప్పాలి. కఠినమైన పదాలను వాడితే మీ మాటలపై వారికి ఆసక్తి తగ్గుతుంది.

బుక్స్, పేపర్ వంటివి చదువుతూ ఉండాలి. దీని వల్ల మీ భాషా నైపుణ్యం పెరుగుతుంటది. అదేవిధంగా ఎలాంటి సందర్భంలోనైనా అవలీలగా మాట్లాడుతారు.