సూర్యఘర్‌కు దరఖాస్తు చేసుకోండిలా..

ఇళ్ల పై కప్పులపై సోలార్ సిస్టమ్‌ను ఏర్పాటు చేసుకుని సోలార్ విద్యుత్ పొందేందుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

2023-24 నుంచి 2026-27 వరకూ నాలుగేళ్లు ఉండే ఈ పథకానికి రూ.75,021 కోట్లు కేటాయించింది.

ఈ పథకం కింద 2 కిలోవాట్లకు 60 శాతం, అంతకు పైబడితే 40 శాతం రాయితీని అందిస్తారు.

మూడు కిలోవాట్ల సోలార్ ఎనర్జీ ఏర్పాటుకు రూ.1.45 లక్షల ఖర్చయితే కేంద్రం గరిష్ఠంగా రూ.78 వేలు అందిస్తుంది.

pmsuryaghar.gov.in పోర్టల్ లో మీ పేరును రిజిస్టర్ చేసుకోండి. మీ స్టేట్, విద్యుత్ సరఫరా చేసే కంపెనీని ఎంచుకోవాలి.

తర్వాత విద్యుత్ కనెక్షన్ కన్జ్యూమర్ నంబర్, మొబైల్ నంబర్, ఈ-మెయిల్ ఐడీని ఎంటర్ చేయాలి.

కన్జ్యూమర్ నంబర్, మొబైల్ నంబర్ తో లాగిన్ అవ్వాలి. అనంతరం రూఫ్ టాప్ సోలార్ కోసం అప్లై చేయాలి.

దరఖాస్తు పూర్తయ్యాక డిస్కమ్ ను అనుమతి వచ్చేవరకూ వెయిట్ చేయాలి.

అనుమతి వచ్చాక డిస్కమ్ లోని విక్రేతల నుంచి సోలార్ ప్లాంట్ ను ఇన్ స్టాల్ చేసుకోవాలి.

ఇన్ స్టలేషన్ కంప్లీట్ అయ్యాక.. ప్లాంట్ వివరాలను పోర్టల్ లో సబ్ మిట్ చేసి.. నెట్ మీటర్ కు దరఖాస్తు చేసుకోవాలి.

నెట్ మీటర్ ఇన్ స్టలేషన్ అనంతరం.. డిస్కమ్ అధికారులు తనిఖీలు చేసి పోర్టల్ నుంచి కమిషనింగ్ సర్టిఫికేట్ ఇస్తారు.

ఆ సర్టిఫికేట్ పొందిన తర్వాత మీ బ్యాంక్ అకౌంట్ వివరాలతో పాటు క్యాన్సిల్డ్ చెక్ ను పోర్టల్ లో సబ్ మిట్ చేయాల్సి ఉంటుంది. 30 రోజుల్లోగా మీ ఖాతాలో సబ్సిడీ జమ అవుతుంది.