చైనీస్ స్మార్ట్‌ఫోన్ తయారీదారు హానర్ ‘మ్యాజిక్ వి3’ ఫోన్‌ను జూలై 12న విడుదల చేయనుంది.

ఈ ఫోన్‌తో పాటు హానర్ మ్యాజిక్ Vs3, మ్యాజిక్‌ప్యాడ్ 2, మ్యాజిక్‌బుక్ ఆర్ట్ 14 కూడా లాంచ్ కానున్నాయి.

ఇది టండ్రా గ్రీన్, క్విలియన్ స్నో, వెల్వెట్ బ్లాక్ కలర్స్‌లో కూడా అందుబాటులోకి వస్తుంది

ఇది Qualcomm స్నాప్‌డ్రాగన్ 8 Gen 3 ప్రాసెసర్‌ని కలిగి ఉంటుంది.

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI)కి సంబంధించిన డిఫోకస్ ఐ ప్రొటెక్షన్ ఫీచర్ అందించే అవకాశం ఉంది.

దీంతోపాటు డీప్‌ఫేక్ డిటెక్షన్ టెక్నాలజీని ఫోన్‌లో అందించే అవకాశం ఉంది.

Magic V3 స్మార్ట్‌ఫోన్ 66 W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్‌కు మద్దతుతో 5,000 mAh బ్యాటరీని ప్యాక్ చేసే అవకాశం ఉంది.

ఈ స్మార్ట్‌ఫోన్‌లో 50 మెగాపిక్సెల్ కెమెరాను అమర్చినట్లు తాజా నివేదికలు చెబుతున్నాయి.

ఇది ఏఐ టెక్నాలజీతో మార్కెట్‌లో రిలీజ్ అయి అందరినీ ఆకట్టుకుంటుందని టెక్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు

మంచి ఫీచర్లు గల స్మార్ట్‌ఫోన్ కోసం ఎదురుచూస్తున్నట్లయితే ఇది బెస్ట్ ఫోన్‌గా చెప్పుకోవచ్చు.