ప్రముఖ స్మార్ట్‌ఫోన్ల తయారీ కంపెనీ హానర్ ఆగస్టు 2న ‘Honor Magic 6 Pro’ ఫోన్‌ను భారతదేశంలో విడుదల చేయబోతోంది.

కంపెనీ ఈ ఫోన్‌ను ఏడాది ప్రారంభంలో చైనాలో లాంచ్ చేసింది. ఇక ఇప్పుడు భారతదేశంలో లాంచ్ చేయడానికి సిద్ధమైంది.

లాంచ్‌కు ముందు కంపెనీ ఈ ఫోన్ కెమెరా స్పెసిఫికేషన్‌ల గురించి కొన్ని ముఖ్యమైన విషయాలు వెల్లడించింది.

హానర్ మ్యాజిక్ 6 ప్రోలో కంపెనీ కెమెరా సిస్టమ్‌పై ప్రత్యేక దృష్టి పెట్టింది. AI పవర్డ్ నెక్స్ట్ జనరేషన్ ఫాల్కన్ కెమెరా సిస్టమ్‌తో అందించబడింది.

అద్భుతమైన ఫోటోగ్రఫీ అనుభూతిని అందించాలనే ఉద్దేశ్యంతో ఈ ఫోన్ రూపొందించినట్లు కంపెనీ తెలిపింది. ఫోన్‌లో ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంది.

ప్రధాన లెన్స్ 50 మెగాపిక్సెల్స్, ఇందులో సూపర్ డైనమిక్ ఫాల్కన్ కెమెరా H9000 HDR సెన్సార్ ఉంది.

అలాగే180-మెగాపిక్సెల్ టెలిఫోటో కెమెరా, 50-మెగాపిక్సెల్ అల్ట్రావైడ్, మాక్రో కెమెరాను కలిగి ఉంది.

హానర్ మ్యాజిక్ 6 ప్రో ముందు వైపు 50-మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాతో ఉంది. ఇది f/2.0 ఎపర్చరు వైడ్ యాంగిల్ లెన్స్‌తో రాబోతోంది.

ఇది 3D డెప్త్ సెన్సార్‌ను కలిగి ఉంది. 30 FPS వద్ద 4K వీడియో రికార్డింగ్‌కు, సెకనుకు 30/60 ఫ్రేమ్‌లను సపోర్ట్ చేయగలదు.

ఈ ఫోన్ 2800 x1280 పిక్సెల్‌ల రిజల్యూషన్‌తో 6.8 అంగుళాల LTPO డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. దీనికి 100% DCI-P3 కలర్ గామట్ సపోర్ట్ ఉంటుంది.