నోకియా ఫోన్ తయారీ సంస్థ HMD కొత్త ఫోన్లను వరుసగా మార్కెట్లోకి విడుదల చేస్తోంది.
ఇటీవలే కంపెనీ హెచ్ఎమ్డీ స్కైలైన్, హెచ్ఎమ్డీ అట్లాస్, హెచ్ఎమ్డీ రిడ్జ్ ఫోన్లను తీసుకొచ్చింది.
అయితే తాజాగా హెచ్ఎమ్డీ రిడ్జ్ ప్రో స్మార్ట్‌ఫోన్ లాంచ్ చేయనున్నట్లు తెలుస్తోంది.
ఫోన్లో మూడు కెమెరా రింగ్‌లు ఉంటాయి. ఇది LED లైట్‌తో ప్లెయిన్ బ్యాక్ కలిగి ఉంది.
రిడ్జ్ ప్రో ఫుల్ HD+ రిజల్యూషన్‌తో 120Hz రిఫ్రెష్ రేట్ కలిగిన డిస్ప్లేతో వస్తుంది.
ఇది 800 నిట్స్ బ్రైట్‌నెస్‌తో 6.64-అంగుళాల IPS LCD ప్యానెల్‌ను కలిగి ఉంటుంది.
ఫోన్ Qualcomm బడ్జెట్-ఆధారిత చిప్సెట్ స్నాప్‌డ్రాగన్ 4 Gen 2 SoCని కలిగి ఉంటుంది.
ఇది మైక్రో SD ద్వారా 6GB, 8GB RAM+ 128GB, 256GB ఇంటర్నల్ స్టోరేజ్ సపోర్ట్‌తో వస్తుంది.