సాయి పల్లవి, శివకార్తికేయన్ జంటగా నటించిన ‘అమరన్’ అక్టోబర్ 31న విడుదల కానుండగా మేజర్ ముకుంద్ వరదరాజన్ జీవితకథ ఆధారంగా తెరకెక్కింది.
జాన్వీ కపూర్ హీరోయిన్గా నటించిన ‘గుంజన్ సక్సేనా’.. ఎయిర్ ఫోర్స్ పైలెట్ గుంజన్ సక్సేనా జీవితకథ ఆధారంగా తెరకెక్కింది.
అడవి శేష్ నటించిన ‘మేజర్’.. మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ పర్సనల్, ప్రొఫెషనల్ లైఫ్‌ను చూపించింది.
సిద్ధార్థ్, కియారాను కలిపిన ‘షేర్షా’ సినిమా కెప్టెన్ విక్రమ్ బత్రా జీవితకథ ఆధారంగా తెరకెక్కింది.
విక్కీ కౌశల్ హీరోగా నటించిన ‘సామ్ బహదూర్’.. మొదటి ఫీల్డ్ మార్షల్ అయిన సామ్ జీవితకథపై తెరకెక్కిన సినిమా.
విక్కీ కౌశల్ నటించిన మరో మూవీ ‘ఉరి’ కూడా నిజంగానే జరిగిన ఉరి దాడిపై తెరకెక్కింది.
ఇండో పాకిస్థాన్ వార్‌ను ముందుండి నడిపించిన కెప్టెన్ బలరామ్ సింగ్ జీవితకథ ఆధారంగా తెరకెక్కిన సినిమానే ‘పిప్పా’.
అక్షయ్ కుమార్ హీరోగా తెరకెక్కిన ‘కేసరి’.. సారాగఢిలో జరిగిన నిజమైన యుద్ధం ఆధారంగా వచ్చింది.
సైనికులు మాత్రమే కాదు.. నేవీ ఆఫీసర్ల జీవితకథ ఆధారంగా కూడా సినిమా తెరకెక్కింది. అదే ‘ది ఘాజీ అటాక్’.
ఇండో చైనా వార్‌పై తెరకెక్కిన మరొక హిందీ చిత్రం ‘పల్టాన్’. ఇది జేపీ దత్తా డైరెక్ట్ చేశారు.