ఇప్పటికే మెగా ఫ్యామిలీ నుండి ఎంతోమంది హీరోలుగా ఇండస్ట్రీలో అడుగుపెట్టగా.. అందులో సాయి ధరమ్ తేజ్ ఒకడు.

తన పేరు.. తన తల్లి పేరుతో కలవాలని సాయి ధరమ్ తేజ్‌ను సాయి దుర్గా తేజ్‌గా మార్చాడు ఈ మెగా మేనల్లుడు.

సాయి దుర్గా తేజ్ 1986 అక్టోబర్ 15న చెన్నైలో జన్మించాడు. అక్కడే స్కూలింగ్ పూర్తి చేసుకొని హైదరాబాద్‌లో అడుగుపెట్టాడు.

‘పిల్లా నువ్వు లేని జీవితం’ సినిమాతో హీరోగా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు సాయి దుర్గా తేజ్.

చిరంజీవి, పవన్ కళ్యాణ్ మ్యానరిజమ్స్, స్టైల్‌ను ఆన్ స్క్రీన్ చూపిస్తూ మెగా ఫ్యాన్స్‌కు బాగా దగ్గరయ్యాడు.

ఇప్పటివరకు ఏ మెగా హీరోకు రాని అవకాశం సాయి దుర్గా తేజ్‌కు వచ్చింది. పవన్ కళ్యాణ్‌తో కలిసి ‘బ్రో’ మూవీలో స్క్రీన్ షేర్ చేసుకున్నాడు.

ప్రస్తుతం ఒక డెబ్యూ డైరెక్టర్‌తో కలిసి సైఫై థ్రిల్లర్‌లో నటించడానికి సిద్ధమయ్యాడు సాయి దుర్గా తేజ్.

ఒక భయంకరమైన యాక్సిడెంట్ నుండి బయటపడిన తర్వాత ఇప్పుడిప్పుడే సినిమాలపై పూర్తి ఫోకస్ పెట్టాడు.

ఇండస్ట్రీలో వినిపిస్తున్న కథనాల ప్రకారం ఈ మెగా హీరో.. ఒక్క సినిమాకు రూ.8 నుండి 10 కోట్ల పారితోషికం తీసుకుంటాడట.

ఇక సాయి దుర్గా తేజ ఆస్తుల విలువ కూడా రూ.100 నుండి 150 కోట్ల వరకు ఉండే అవకాశం ఉందని గుసగుసలు వినిపిస్తున్నాయి.