గుండె ఆరోగ్యం కోసం కొన్నిపండ్లను కచ్చితంగా తినాలి. విటమిన్లు, ఖనిజాలున్న పండ్లు గుండె ఆరోగ్యంగా ఉంచుతాయి.

స్ట్రాబెర్రీస్, బ్లూబెర్రీస్, బ్లాక్ బెర్రీలు వంటి పండ్లలో ఫ్లేవనాయిడ్లు, యాంటీ ఆక్సిడెంట్లు అధికం. బీపీని తగ్గించి గుండెజబ్బుల నుంచి రక్షణనిస్తాయి.

నారింజలో విటమిన్ సి, పొటాషియం, ఫైబర్ పుష్కలం. కొలెస్ట్రాల్ స్థాయిల్ని తగ్గిస్తుంది.

అరటిపండ్లలో పొటాషియం అధికం. గుండె ఆరోగ్యానికి ముఖ్యమైనది. సోడియం తక్కువగా ఉంటుంది.

యాపిల్స్ లో కూడా ఫ్లేవనాయిడ్లు, యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. కరిగే ఫైబర్ గుణం ఉండటంతో కొలెస్ట్రాల్ ను తగ్గిస్తుంది.

అవకాడో పండ్లలో మోనోశాచురేటెడ్ కొవ్వులు నిండి ఉంటాయి. ఇవి చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను (LDL) తగ్గించి, మంచి కొలెస్ట్రాల్ స్థాయిలను (HDL) పెంచుతాయి.

దానిమ్మ పండ్లలో ఆంథోసైనిన్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి ఇన్ ఫ్లమేషన్ తగ్గించడం, కొలెస్ట్రాల్ స్థాయిలను మెరుగుపరచడం ద్వారా గుండెను రక్షించడంలో సహాయపడతాయి.

ఎరుపు, ఊదా రంగు ద్రాక్షలో పాలీఫెనాల్స్ అని పిలిచే యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. రక్తం గడ్డకట్టడాన్ని నివారిస్తాయి.

కివిలో విటమిన్ సి, ఫైబర్, పొటాషియం పుష్కలం. పొటాషియం బీపీని కంట్రోల్ లో ఉంచుతుంది.

పుచ్చకాయలో లైకోపీన్ పుష్కలం. శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్ ఇది. గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది.

చెర్రీల్లో ఆంథోసైనిన్లు ఉంటాయి. రక్తపోటు, కొలెస్ట్రాల్ స్థాయిల్ని తగ్గించడంలో సహాయపడుతాయి.