ప్రతిరోజూ ఆహారంలో ఇంగువను తీసుకుంటే మీ శరీరంలో ఊహించని మార్పులు వస్తాయి.

సాధారణంగా ఇంగువను పప్పు, సాంబార్, పులిహోరలో ఎక్కువగా వాడుతారు.

ఇంగువతో వంట రుచి మారుతుంది. ఆరోగ్యానికి కూడా చాలా మంచిది.

ఇందులో యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు, యాంటీ ఫంగల్ గుణాలుంటాయి.

ఇంగువలో శరీరానికి అవసరమయ్యే ఎన్నో పోషకాలున్నాయి.

ప్రతిరోజూ ఇంగువను ఆహారంలో తీసుకుంటే జలుబు, దగ్గు సమస్యలు తగ్గుతాయి.

ఉబ్బసం, శ్వాసకోశ సమస్యల నుంచి ఉపశమనం పొందవచ్చు.

ఇంగువలో రోగనిరోధకశక్తిని పెంచే గుణాలున్నాయి.

చెడు బ్యాక్టీరియాను శరీరం నుంచి తొలగిస్తుంది.

జీర్ణవ్యవస్థ ఆరోగ్యంగా మారుతుంది.

కడుపు ఉబ్బరం, కడుపులో గ్యాస్, అజీర్తి, మలబద్ధకం వంటి సమస్యలు తగ్గుతాయి.

ఇంగువలో యాంటీ ఆక్సిడెంట్లు అధికం. ఫ్రీ రాడికల్స్ ను నిరోధిస్తుంది.

బీపీ పేషంట్లు ఇంగువ తీసుకుంటే కంట్రోల్ అవుతుంది.