అరటి పండుతో ఆరోగ్య ప్రయోజనాలెన్నో!

అన్ని సీజన్‌లలో లభించే.. చౌకగా అందుబాటులో ఉండే అరటిపండ్లతో ఆరోగ్యానికి బోలెడు ప్రయోజనాలున్నాయి.

అరటి పండ్లలో ఉండే పొటాషియం ఎముకలు, దంతాలకు మంచిది.

వారానికి రెండు నుంచి మూడు అరటి పండ్లు తింటే కిడ్నీ జబ్బులు మహిళల దరిచేరవు.

రోజుకో అరటి పండు తినడం వల్ల ఆస్తమా లక్షణాలు తగ్గుతాయి.

ఇందులో ఉండే ఫైబర్, పొటాషియం బీపీని తగ్గించి, క్యాన్సర్‌తో పోరాడతాయి.

అరటి పండ్ల వల్ల చర్మం కూడా ఆరోగ్యకరంగా ఉంటుంది.

అరటి పండులోని పొటాషియం, సోడియం రక్త ప్రవాహాన్ని మెరుగుపరుస్తాయి. బీపీని నివారిస్తాయి.

ఇందులో ఉండే ఐరన్ అనీమియా నుంచి కాపాడుతుంది. రక్త హీనతను నివారిస్తుంది.

అరటి పండు అల్సర్స్ సమస్యలను నయం చేస్తుంది.

బాగా పండిన అరటి పండులోని పోషకాలు సాధారణ అరటిపండులో కంటే తక్కువగా ఉంటాయి. పండిన కొద్దీ విటమిన్ సీ, ఫోలిక్ యాసిడ్, థయామిన్‌ల శాతం తగ్గుతుంది.