పచ్చి టమాటా రసం ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. దీన్ని తాగడం వల్ల పుష్కలమైన ప్రయోజనాలు ఉంటాయని నిపుణులు చెబుతున్నారు.

టమాటా రసం శరీరంలో పేరుకుపోయిన కొలస్ట్రాల్ ను తగ్గించేందుకు తోడ్పడుతుంది.

అంతేకాదు రక్తపోటు, గుండెపోటు వంటి సమస్యలను కూడా తగ్గిస్తుంది.

ముఖ్యంగా ఒత్తిడి, పనిలో టెన్షన్ ఫీల్ అయ్యే వారు టమాటా రసం తీసుకుంటే అనేక ప్రయోజనాలు ఉంటాయి.

దీర్ఠకాలికంగా బాధపడే సమస్యలను నివారించడానికి టమాటా రసం అద్భుతంగా పనిచేస్తుంది.

టమాటలో ఉండే లైకోపీన్ అనే యాంటీ ఆక్సిడెంట్ శరీరంలోని ఫ్రీ రాడికల్స్ తో పోరాడడానికి సహాయపడుతుంది.

తరచూ టమాటా రసం తీసుకుంటే క్యాన్సర్ వంటి సమస్యను తగ్గించుకోవచ్చు. అంతేకాదు బ్రెస్ట్ క్యాన్సర్ ను నివారించడంలోను ఇవి సహాయపడుతుంది.

టమాటాలో యాంటీ ఏజింగ్ లక్షణాలు ఉంటాయి. అందువల్ల ఇది చర్మాన్ని రక్షించడానికి సహాయపడుతుంది.

టమాటాలో ఉండే ఫైబర్ జీర్ణక్రియ వ్యవస్థను మెరుగుపరుస్తుంది. అంతేకాదు మలబద్ధకం, కడుపులో ఆమ్లత వంటి వాటిని తగ్గించడానికి కూడా తోడ్పడుతుంది.

గుండె సంబంధింత సమస్యలకు టమాటా రసం తాగడం వల్ల ఎంతో మేలు జరుగుతుంది. దీనిపై పూర్తి సమాచారం కోసం వైద్యులను సంప్రదించాలి.