సీజనల్ గా వచ్చే ఫ్రూట్స్ తో ఆరోగ్యానికి చాలా మేలు జరుగుతుంది.

వేసవిలో వచ్చే ఫాల్సా పండ్లు కూడా ఆరోగ్యానికి చాలా మంచివి.

వీటిని ఇండియన్ షెర్బెత్ బెర్రీ అని కూడా పిలుస్తారు. వేసవి రిఫ్రెష్ డ్రింక్ గా కూడా వాడుతారు.

ఫాల్సా పండ్లు చాలా టేస్టీగా ఉంటాయి. వీటి శాస్త్రీయనామం  గ్రేవియా ఆసియాటికా.

సమ్మర్ బెస్ట్ ఫ్రూట్ గా పిలిచే ఫాల్సా.. శరీరంలో వేడిని తగ్గించి.. వడదెబ్బ నుంచి కాపాడుతుంది.

వీటిలో విటమిన్ ఏ, సి వంటి పోషకాలు పుష్కలం. శరీరాన్ని హైడ్రేటెడ్ గా ఉంచుతాయి.

ఐరన్ లోపం తగ్గి.. అలసట, తలనొప్పి, తల తరగడం నుంచి ఉపశమనం లభిస్తుంది. రక్తహీనత తగ్గుతుంది.

ఫాల్సా ఫ్రూట్ లో ఉండే గ్లైసెమిక్ ఇండెక్స్ బ్లడ్ షుగర్ ను కంట్రోల్ లో ఉంచుతుంది.

ఫాల్సాలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు గుండె సంబంధిత వ్యాధుల నుంచి రక్షిస్తాయి. రక్తపోటును కంట్రోల్ లో ఉంచడమే కాకుండా గుండె ఆరోగ్యాన్ని ప్రోత్సహిస్తుంది.

డయేరియా నుంచి రక్షిస్తాయి. ఫాల్సాను డైరెక్ట్ గా తినొచ్చు. లేదా జ్యూస్ చేసుకుని తాగొచ్చు కూడా.