మనిషి ఆరోగ్యం కోసం ప్రకృతి ఎన్నో పండ్లను ఇస్తుంది. వాటిలో ఈ స్నేక్ ఫ్రూట్స్ కూడా ఒకటి

ఆగ్నేయాసియా దేశానికి చెందిన వీటిని సలాక్ అని పిలుస్తారు.

ఈ పండురూపం, ఆకృతి కారణంగా స్నేక్ ఫ్రూట్ అంటారు. యాపిల్, పైనాపిల్స్ కంటే ఇందులో పోషకాలెక్కువ.

విటమిన్ సి, పొటాషియం, ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు వంటి ముఖ్యమైన పోషకాలు పుష్కలం.

సలాక్ లో ఉండే పెక్టిన్, పొటాషియం జ్ఞాపకశక్తిని పెంచుతాయి.

ఈ పండులో ఉండే బీటా కెరోటిన్.. కంటి సంబంధిత రోగాలను నివారిస్తుంది.

టానిన్లు, ఫ్లేవనాయిడ్లు, సపోనిన్లు విరేచనాలను నిరోధిస్తాయి. జీర్ణ ఆరోగ్యాన్ని ప్రోత్సహిస్తాయి.

ఇందులో ఉండే ఫైబర్ కంటెంట్ పేగు కదలికలను నియంత్రిస్తుంది. దీర్ఘకాలిక కడుపు సమస్యల్ని నివారిస్తుంది.

సలాక్‌లోని పొటాషియం, యాంటీఆక్సిడెంట్లు రక్తపోటును నియంత్రించడం ద్వారా గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తాయి.