కుంకుమ పువ్వు తింటే పిల్లలు తెల్లగా పుడతారా?

గర్భిణీ స్త్రీల్లో సాధారణంగా జీర్ణ సంబంధిత సమస్యలు వస్తాయని అందరికి తెలుసు. అయితే కుంకుమ పువ్వులను తింటే మల బద్దకం తగ్గుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

గర్బం దాల్చినప్పుడు వేవిళ్ల సమస్య సాధారణంగా వస్తుంది. కుంకుమ పువ్వు తినడం వల్ల ఈ సమస్య నుండి బయటపడవచ్చు.

సాధారణంగా గర్భందాల్చిన స్త్రీలో  ఒత్తిడి, మూడ్ స్వింగ్స్, ఇలా రకరకాల సమస్యలు  వస్తాయి. కుంకుమ పువ్వును పాలలో కలిపి తీసుకుంటే ఈ సమస్యల నుండి బయటపడవచ్చు.

కొందరిలో రక్తహీనత తక్కువగా ఉంటుంది. అలాంటి వారు ఐరన్ సప్లిమెంటరీ తీసుకోవాలి. కుంకుమ పువ్వులో ఐరన్ పుష్కలంగా లభిస్తుంది.

గర్భిణీ స్త్రీల్లో  బీపీ అదుపులో ఉండాలంటే కుంకుమ పువ్వును తీసుకోవచ్చని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.

రోగ నిరోధక శక్తిని పెంచాలంటే  కుంకుమ పువ్వును తినొచ్చు. ఇవి ఇన్ఫెక్షన్లు, అలర్జీలు తగ్గించడంలో సహాయపడతాయి.

గర్బిణుల్లో సాదారణంగా జుట్టు రాలిపోతుంది. కుంకుమ పువ్వును తీసుకుంటే జుట్టు రాలే సమస్య  తగ్గిపోతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే.