గుమ్మడికాయలో అనేక పోషకాలు ఉంటాయి. గుమ్మడికాయ రసం కూడా ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.

గుమ్మడి కాయ జ్యూస్ ఇతర రసాలతో పోలిస్తే పోషకాలు, రుచి విషయంలో ఏ మాత్రం తక్కువకాదనే చెప్పాలి.

గుమ్మడికాయ రసం తాగడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. దీని వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది.

కంటికి మేలు చేస్తుంది: గుమ్మడికాయలో బీటా కెరోటిన్ పుష్కలంగా ఉంటుంది. ఇది కంటి చూపునకు చాలా మంచిది.

ఇది కంటిశుక్లం, వయస్సు సంబంధిత మచ్చల ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది.

రోగనిరోధక శక్తి పెంచుతుంది: గుమ్మడికాయలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది.

ఇది రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తుంది. అంతే కాకుండా ఇన్ఫెక్షన్ల నుండి రక్షిస్తుంది.

జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది: గుమ్మడికాయలో ఉండే ఫైబర్ జీర్ణక్రియను ఆరోగ్యంగా ఉంచుతుంది.

మలబద్ధకం సమస్యను కూడా దూరం చేస్తుంది. ఇది పేగు ఆరోగ్యానికి కూడా మంచిది

చర్మానికి మేలు చేస్తుంది:  గుమ్మడికాయలో యాంటీఆక్సిడెంట్లు పుష్కంగా ఉంటాయి.