యాపిల్ లాగే కనిపించే పియర్స్ పండ్లలో పోషకాలు ఎక్కువగా ఉంటాయి.

గుండె ఆరోగ్యానికి, అధిక బరువు సమస్యలకు ఈ పండు దివ్య ఔషధం

ఇందులో కాల్షియం, ఐరన్, పొటాషియం, మెగ్నీషియం, విటమిన్స్ C, E, K ఉంటాయి.

రెగ్యులర్‌గా పియర్స్ తినడం వల్ల బరువు, టైప్ 2 డయాబెటిస్ తగ్గుతాయి.

పియర్స్ పండుని మందుల తయారీలోనూ వాడుతున్నాయి.

వీటిలో కాల్షియం, పాస్పరస్, మాంగనీస్, మెగ్నీషియంలు ఉంటాయి. వీటి వల్ల ఎముకలు చాలా బలంగా తయారు అవుతాయి.

పియర్స్‌లో ఉండే ఫైబర్ వల్ల మన శరీరంలోని కొలెస్ట్రాల్ తగ్గి బాడీ వెయిట్ కూడా కంట్రోల్ అవుతుంది.

ఇవి ఎర్రరక్త కణాల సంఖ్యను  పెంచుతాయి. నీరసం తగ్గిస్తాయి.

ఈ పండు తినడం వల్ల శరీరంలో వ్యాధినిరోధక శక్తి పెరుగుతుంది.

డయాబెటిస్ పేషెంట్లు, హార్ట్ పేషెంట్లు కూడా వీటిని తినవచ్చు.

వీటిని రోజులో రెండు కంటే ఎక్కువ తింటే కడుపులో గ్యాస్, పొట్ట ఉబ్బరం సమస్యలు వస్తాయి.