మొర్రి పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

మొర్రి పండ్లు అటవీ ప్రాంతాల్లో మాత్రమే అరుదుగా లభిస్తాయి.

పోషక విలువలు, ఔషధ గుణాలు పుష్కలంగా లభిస్తాయని ఆరోగ్య నిపుణులు చెబుతుంటారు.

మొర్రి పండ్లలో ఒక గింజ మాత్ర‌మే ఉంటుంది. ఈ గింజలు డ్రై ఫ్రూట్ గా మార్కెట్‌‌లో కూడా లభ్యమవుతాయి.

మొర్రి పండ్లలో సమృద్ధిగా విటమిన్ సి, విటమిన్ ఎ, విటమిన్ బి1, బి2, నియాసిన్, ఐరన్, కాల్షియం, మెగ్నీషియం, పీచు పదార్థం, ప్రొటీన్లు, కార్బోహైడ్రేట్లు పుష్కలంగా లభిస్తాయి.

వేసవిలో దొరికే మొర్రి పండ్లు మన శరీరాన్ని చల్లబరిచే సహజ గుణాలు పుష్కలంగా ఉన్నాయి

వ్యాధి నిరోధక శక్తి పెంపొందించడంలో సహాయపడతాయి.

పీచు పదార్థం అధికంగా ఉండడం జీర్ణశక్తి మెరుగుపడి మలబద్ధకాన్ని తొలగించి పొట్టని శుభ్రంగా ఉంచుతుంది.

డయేరియా తో బాధపడేవారు ఈ పండ్లను తింటే తక్షణ ఉపశమనం లభిస్తుంది.

 రక్తంలో గ్లూకోస్థాయిలను నియంత్రించి డయాబెటిస్ వ్యాధిని నియంత్రణలో ఉంచుతుంది.