ఉలవలతో ఆరోగ్య ప్రయోజనాలు మెండు!
ఉలవల్లో ఉన్నన్ని పోషకాలు మరే ఇతర ధాన్యంలోనూ ఉండవు. ఐరన్, కాల్షియం, పాస్ఫరస్, ఫైబర్ ఉంటాయి.
ఉలవలు ఆకలిని పెంచడంతోపాటు ప్లీహ వ్యాధులతో బాధపడేవారికి మేలు చేస్తాయి.
దీర్ఘకాలం పాటు అనారోగ్యంతో బాధపడి కోలుకొన్నవారు తరచూ ఉలవలను తీసుకొంటే త్వరగా జీర్ణ శక్తి మెరుగుపడుతుంది.
ఊపిరితిత్తుల్లో పేరుకుపోయి, గట్టిపడిన కఫాన్ని పలుచబరచడంలో ఉలవలు చక్కగా ఉపయోగపడతాయి.
అకారణంగా కన్నీరు కారటం, కళ్లల్లో పుసులు కట్టడం వంటి సమస్యలున్న వారు ఉలవలతో చేసిన అహారం తీసుకుంటే చక్కని గుణం కనిపిస్తుంది.
మూత్రంతో మంటతో ఇబ్బంది పడేవారు ఉలవచారుకి సమాన భాగం కొబ్బరి నీరు కలిపి తీసుకుంటుంటే ఉపశమనం లభిస్తుంది.
ఉలవలు తింటే రాళ్లు కరిగి కిడ్నీల పనితీరు కూడా మెరుగుపడుతుంది.
ఊబకాయానికి ఉలవలు మించిన ఔషధం.
త్వరగా బరువు తగలనుకునేవారికి ఉలవలు మంచి సహాయకారి.
ఉలవలు దెబ్బతిన్న కాలేయాన్ని కోలుకునేలా చేస్తాయి.