లవంగాల్లో అనేక పోషకాలు ఉంటాయి. ఇవి శరీరానికి ఎంతో మేలు చేస్తాయి.

ఇవి యాంటీఆక్సిడెంట్లు, విటమిన్లు , ఖనిజాలను కలిగి ఉంటాయి

లవంగాలను ఉదయం పూట ఖాళీ కడుపుతో తీసుకోవడం వల్ల జీర్ణవ్యవస్థకు చాలా మేలు జరుగుతుంది.

 ఇది గ్యాస్ట్రిక్ ఎంజైమ్‌లను సక్రమంగా పనిచేసేలా చేస్తుంది. తరుచుగా లవంగాలు తినడం వల్ల ఆహారం త్వరగా జీర్ణమవుతుంది.

లవంగాలలో అధిక మొత్తంలో యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి.

ఇవి శరీరంలోని ఫ్రీ రాడికల్స్‌ను తగ్గించి రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తాయి.

ప్రతి రోజు ఉదయం ఖాళీ కడుపుతో లవంగాలను తినడం వల్ల జలుబు, దగ్గు, వైరల్ ఇన్ఫెక్షన్లు రాకుండా ఉంటాయి.

ఇందులో ఉండే యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు చిగుళ్ల వాపు, నొప్పులను తగ్గిస్తాయి.

లవంగాలలో ఉండే పోషకాలు శరీరంలోని కొవ్వును తగ్గించడంలో సహాయపడతాయి.