బిర్యానీ ఆకును కూరల్లో వాడుతుంటారు.

మరో విషయం ఏమంటే.. దీనిని ఎప్పట్నుంచో సాంప్రదాయ వైద్యంలోనూ మందులా వాడుతున్నారు.

అయితే, ఈ ఆకును ఆహార పదార్థాల్లో వేయడం వల్ల మంచి ఫ్లేవర్ వస్తుంది.

అదేవిధంగా ఇది ఆరోగ్యానికి చాలా మంచిది.

ఇందులో పోషక విలువలు ఉండడం వల్ల ఇది మనకు రకరకాలుగా ఉపయోగపడుతుంది.

మెదడు మరింత బాగా పనిచేస్తుంది.

కీళ్ల నొప్పులను తగ్గించడంలో కీలక పాత్ర పోషిస్తుంది.

వాపులు, నొప్పులు తగ్గుతాయి.

జలుబు, దగ్గు, గొంతు నొప్పి తదితర శ్వాస కోశ సంబంధిత సమస్యల బారి నుంచి బయటపడొచ్చు.

బరువు తగ్గాలనుకునేవారికి ఈ ఆకు చాలా బాగా పని చేస్తుంది.

హైపర్ టెన్షన్ లాంటివి మీ దరి చేరవు.

గుండె పోటు లాంటి ప్రమాదాలు తగ్గుతాయి.

క్యాన్సర్ కణాల నివారణలోనూ బిర్యానీ ఆకు కీలక పోత్ర పోషిస్తుంది.