గ్రీన్ టీతో కలిగే ఆరోగ్య ప్రయోజనాలివే!

గ్రీన్ టీని సహజ డిటాక్స్ అని పిలుస్తుంటారు. ప్రతి రోజూ ఒక్క కప్పు గ్రీన్ టీ తీసుకుంటే ఆరోగ్యానికి మంచిది.

రోజూ గ్రీన్ టీ తీసుకుంటే బరువు తగ్గడంతో పాటు ఆరోగ్యం మెరుగవుతుంది.

గ్రీన్ టీలో ఉన్న యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీస్‌లో డెన్సిటీ కొలెస్ట్రాల్ ఆక్సిడైజ్ కాకుండా చూస్తాయి.

గ్రీన్ టీని నిత్యం తీసుకోవడంతో మెదడు చురుగ్గా పనిచేయడం, జ్ఞాపకశక్తి కూడా బాగా పెరుగుతుంది.

గ్రీన్ టీతో ఇన్సులిన్ సెన్సిటివిటీ పెరగడంతోపాటు టైప్ 2 డయాబెటీస్ వచ్చే రిస్క్ తగ్గుతుందని చెబుతుంటారు.

డెంటల్ హెల్త్‌కి క్యావిటీలు వచ్చే రిస్క్ తగ్గడానికి గ్రీన్ టీ పనిచేస్తుంది.

ఇందులో ఉండే పాలీ ఫెనాల్స్..చర్మంపై ముడతలు రాకుండా చేస్తుంది.

గ్రీన్ టీ తీసుకోవడంతో హైబీపీ రిస్క్ తగ్గుతుంది.

గ్రీన్ టీలో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ హెయిర్ లీస్‌ను అరికడతాయి.

క్యాన్సర్ వచ్చే రిస్క్‌ను తగ్గించడంతోపాటు ఎముకలు బలంగా ఉండేలా చేస్తుంది.