చాలా మంది తమ ఆరోగ్యం పట్ల కేరింగ్ తీసుకోరు. దానివల్ల ఎన్నో ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటారు.

అందువల్ల మనం ఆరోగ్యంగా ఉండాలంటే తీసుకునే ఆహారం కచ్చితంగా పోషకాలు కలిగి ఉండాలి అని వైద్యులు చెబుతున్నారు.

అలాకాకుండా శరీరానికి హాని చేసే ఆహారాలు తీసుకుంటే మాత్రం మనల్ని కాపాడటం ఎవరితరం కాదని హెచ్చరిస్తున్నారు.

ముఖ్యంగా వైద్యుల సూచనలు వినకపోతే గుండె వ్యాధులు, మధుమేహం, ఊబకాయం వంటి అనారోగ్య సమస్యలు వస్తాయని చెబుతున్నారు.

ఎక్కువగా సోడియం అధికంగా ఉండే ఫుడ్స్, ప్రాసెస్డ్ మాంసం, చక్కెర పానీయాలు, అన్ ప్రాసెస్డ్ మాంసం తీసుకోకూడదని అంటున్నారు.

ఇలా తీసుకుంటే గుండె సంబంధిత రోగాలు, డయాబెటిస్‌ తో మరణించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెబుతున్నారు.

ఇవి మాత్రమే కాకుండా గింజలు, తృణధాన్యాలు, ఓమేగా 3 ఫ్యాట్స్, సీ ఫుడ్, కూరగాయలు, పండ్లు తక్కువగా తీసుకోకూడదు అంటున్నారు.

ఇలా తక్కువగా తినేవారిలోనూ మరణించే అవకాశాలు అధికంగానే ఉన్నాయని హెచ్చరిస్తున్నారు.

గుండె సమస్యలు రాకుండా ఉండేందుకు కొన్ని ఆహారపు అలవాట్లు చేసుకోవాలంటున్నారు.

ఆరోగ్యకరమైన జీవితం కోసం కూరగాయలు, పండ్లు, తృణధాన్యాలు తీసుకోవాలి. తక్కువ కొవ్వు ఉన్న డెయిరీ ఉత్పత్తులు లేదా కొవ్వు లేని పదార్థాలను తీసుకోవాలి అని చెబుతున్నారు.

ఆరోగ్యకరమైన జీవితం కోసం కూరగాయలు, పండ్లు, తృణధాన్యాలు తీసుకోవాలి. తక్కువ కొవ్వు ఉన్న డెయిరీ ఉత్పత్తులు లేదా కొవ్వు లేని పదార్థాలను తీసుకోవాలి అని చెబుతున్నారు.

ఇవి మాత్రమే కాకుండా మాంసం, పౌల్ట్రీ ఉత్పత్తులు, చేపలు, బీన్స్, గుడ్లు, గింజధాన్యాలు కూడా ఎక్కువగా తీసుకోవాలని చెబుతున్నారు.