రేపు స్నేహితుల దినోత్సవం. ఈ సందర్భంగా ఫ్రెండ్‌షిప్ బ్యాక్ డ్రాప్‌లో వచ్చిన కొన్ని సినిమాల గురించి తెలుసుకుందాం.

చిరంజీవి నటించిన స్నేహంకోసం. పేద ధనిక అనే బేధాబ్రియాలు లేకుండా మిత్రుడిని మిత్రుడిలా చూడాలి అనే కథాంశంతో ఈ సినిమా తెరెక్కింది.

ప్రేమదేశం.. ఈ సినిమాలో ప్రేమకు ఎంతటి ప్రాధాన్యత ఇచ్చారో.. ఫ్రెండ్ షిప్‌కి అంతే వాల్యూ ఇచ్చారు. ఇద్దరు స్నేహితులు కలిసి ఒకే అమ్మాయిని లవ్ చేసినపుడు వారి మధ్య తలెత్తే సంఘర్షనలు ఎలా ఉంటాయో చూపించారు

పాదమెటు పోతున్నా.. పయనమెందాకైనా అంటూ సాగే ఈ సాంగ్ వింటే చాలు ఫ్రెండ్ షిప్ విలువేంటో తెలుస్తుంది.

ఓ ఆటను ప్రాణంకన్నా ఎక్కువగా ఇష్టపడే స్నేహితుల కథే ఈ సినిమా.

ట్రెండు మారినా ఫ్రెండు మారడే అంటూ స్నేహానికి సరికొత్త అర్థం చెప్పిన సినిమా ఉన్నది ఒకటే జిందగీ. లైఫ్‌లో ఒక స్నేహితుడు ఎందుకు ముఖ్యమో ఇందులో చూపించారు.

ఈ సినిమాలో ఓ స్నేహితుడి కోసం ప్రపంచ స్థాయి సంస్థకు సీఈఓగా ఉన్న ఓ వ్యక్తి ఏం చేశాడు అనే కథాంశంతో తెరకెక్కింది.

చిన్ననాటి నుంచి వారి మధ్య చిగురించిన స్నేహం పెళ్లాయ్యాక ఎలా ఉంటుంది. ఆ స్నేహం జీవితాంతం ఉంటుందా లేదా అనే కథాంశంతో తెరకెక్కింది.

ఫ్రెండ్ ఒక అమ్మాయిని లవ్ చేస్తున్నా అని చెప్పగానే.. అతడి కోసం ఏమైనా చేయడానికి సిద్ధపడతారు ఇతర ఫ్రెండ్స్. అలాంటి కథాంశంతోనే ఇది తెరకెక్కింది.

ఒక ఫ్రెండ్‌కు ఇచ్చిన మాట కోసం ఎంతటి సమస్యలను అయినా ఎదుర్కోవడానికి సిద్ధపడే కథాంశంతో తెరకెక్కింది సలార్.

వీటితో పాటు మరెన్నో సినిమాలు ఉన్నాయి.