కాలుష్యం నుంచి మీ ఊపిరితిత్తులను కాపాడే ఆహారాలు ఇవే..
విటమిన్ సి ఎక్కువగా ఉన్న ఉసిరికాయ, ఆరంజ్, జామ, దానిమ్మ లాంటి పండ్లు కాలుష్యం వల్ల కలిగే ఒత్తిడితో పోరాడుతాయి.
కాలుష్యంతో చర్మం టిష్యూ డ్యామేజ్ ని రిపేరు చేయడానికి విటమిన్-ఇ ఉన్న ఆలివ్ ఆయిల్, సన్ఫ్లవర్ ఆయిల్ వినియోగించాలి.
బాదం, చియా సీడ్స్, వాల్ నట్స్, వంటి నట్స్ లో ఒమెగా 3 ఫ్యాట్స్ ఉండడంతో ఇవి కాలుష్యం ప్రభావాలతో పోరాడి గుండెని కాపాడుతాయి.
బెల్లం, ఉల్లి రసం కలిపి తీసుకుంటే తడి, పొడి దగ్గు దూరమవుతుంది.
పసుపుని నేయితో కలిపి కొద్దిగా తీసుకుంటే దగ్గు, ఆస్తమా నుంచి ఉపశమనం కలుగుతుంది.
స్పైనాచ్ ఆకు కూర తినడం వల్ల ఊపిరితిత్తులకు బలం చేకూరుతుంది.