మెరిసే చర్మం కావాలని అందరూ కోరుకుంటారు. కానీ కాలుష్యం వల్ల కాంతిహీనంగా కనిపిస్తుంది.

ఖరీదైన కాస్మోటిక్స్ వాడినా చర్మానికి ప్రమాదమే తప్ప ఉపయోగం ఉండదు.

మీ డైలీ రొటీన్ ఫుడ్ లో కొన్ని మార్పులు చేసుకుంటే చాలు

ప్రతిరోజూ ఆహారంలో ఆకుకూరలను తీసుకోవాలి.

వీటిలో విటమిన్లు, మినరల్స్ అధికం. హైపర్ పిగ్మెంటేషన్ రాకుండా ఉంటుంది.

రోజుకు కనీసం 3-4 లీటర్ల నీరు తాగాలి. శరీరం హైడ్రేటెడ్ గా ఉంటుంది.

నిమ్మరసం లేదా కలబంద రసం తాగితే చర్మం మెరుస్తుంది.

ఉదయాన్నే గోరువెచ్చని నీటిలో నిమ్మరసం కలిపి తాగితే.. జీర్ణక్రియ కూడా మెరుగవుతుంది.

డైలీ డైట్ లో పండ్లను తీసుకోవాలి. వీటలో విటమిషన్లు, చర్మం మెరుపుకు కావలసిన పోషకాలు ఉంటాయి.

కీర దోసకాయ, క్యారెట్, టమోటా, క్యాబేజీ, బీట్ రూట్ కలిపిన సలాడ్ తీసుకోవాలి.

అలాగే ప్రతీరోజూ ఒక కప్పు పెరుగును కూడా తీసుకోవాలి.

బయటి నుంచి ఇంటికి వచ్చిన వెంటనే ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి.