డ్రాగన్ ఫ్రూట్‌ తింటే..  ఆ వ్యాధులు దరిచేరవు!

డ్రాగన్ ఫ్రూట్‌‌ను తెలుగు రాష్ట్రాల్లో గులాబీ పండు అని పిలుస్తారు. ఈ ఫ్రూట్‌‌ని చైనీస్ ఫ్రూట్‌‌గా భావిస్తారు.

డ్రాగన్ ఫ్రూట్‌‌ మూడు రంగుల్లో లభిస్తుంది. ఇండియాలో ఎక్కువగా రెడ్ కలర్‌ పండిస్తున్నారు.

ఈ ఫ్రూట్‌‌ ఆరోగ్యానికి చాలా మంచిది. మధుమేహం, గుండె జబ్బులు రాకుండా నివారిస్తుంది.

డ్రాగన్ ఫ్రూట్‌లో ఫ్లేవనాయిడ్స్, ఫినోలిక్ యాసిడ్ ,బీటాసినిన్స్ యాంటీ ఆక్సిడెంట్లు, ఫైబర్, విటమిన్ సి పుష్కలంగా ఉంటాయి.

శరీర రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తుంది. శరీరంలోని కొలెస్ట్రాల్ స్థాయిలను అదుపులో ఉంచుతుంది.

డ్రాగన్ ఫ్రూట్ ప్రీబయోటిక్ లక్షణాలను కలిగి ఉంటుంది. ప్రీబయోటిక్స్ చెడు బ్యాక్టీరియాను నాశనం చేస్తూ మంచి బ్యాక్టీరియా వృద్ధిని ప్రోత్సహిస్తాయి.

డ్రాగన్ ఫ్రూట్‌లో బీటా కెరోటిన్ ,లైకోపీన్ ఉంటాయి. కెరోటినాయిడ్స్ అధికంగా ఉండే ఆహారాన్ని తినడంతో క్యాన్సర్, గుండె జబ్బుల ప్రమాదాన్ని కూడా తగ్గిస్తుంది.

డ్రాగన్ ఫ్రూట్ ఎనర్జీ రిచ్ ఫ్రూట్. ఒక డ్రాగన్ ఫ్రూట్‌లో 102 కేలరీల శక్తి ఉంటుంది.

డ్రాగన్ ఫ్రూట్‌ జీర్ణశక్తిని బలపరుస్తుంది. దీని గింజల్లో ఒమేగా-3 , ఒమేగా-9 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి.