ముక్కు దిబ్బడగా ఉంటే.. నిద్రపోవడం కష్టంగా ఉంటుంది. ఆటోమెటిక్ గా నిద్రలో నోటితోనే శ్వాస తీసుకుంటాం.

జలుబు లేకపోయినా కొందరికి ఈ అలవాటు ఉంటుంది. ఇది ప్రమాదకరమైన ఆరోగ్య సమస్యల్ని తెచ్చిపెడుతుంది.

ఇలా చేయడం వల్ల నోరు త్వరగా పొడిబారడం, శ్వాస వాసన చెడుగా రావడం, గొంతు బొంగురుపోవడం వంటివి జరుగుతాయి.

దీర్ఘకాలిక అలసట, కళ్ల కింద నల్లటి వలయాలు కూడా వస్తాయి.

చిగుళ్ల వాపు, దంత క్షయం, గొంతు, చెవి ఇన్ఫెక్షన్లు, బీపీ, హార్ట్ ఫెయిల్యూర్ కు కారణం కావొచ్చు.

ముక్కులోనికి వెళ్లే గాలి మృదమైన మార్గం ద్వారా ఊపిరితిత్తులను చేరుకోవడంలో అడ్డంకులు ఏర్పడితే నోటిద్వారా శ్వాస తీసుకుంటారు.

టాన్సిల్స్ పెద్దవైనా, ఒత్తిడి, మానసిక ఆందోళనలు, ముక్కులో పాలిప్స్, కణితులు ఉన్నా ఇలా శ్వాస తీసుకుంటారు.

మీకు రోజూ నోటితో గాలి పీల్చుకుని నిద్రపోయే అలవాటుంటే వెంటనే వైద్యుడిని సంప్రదించడం ఉత్తమం.