'దేవర' మినీ రివ్యూ...  సినిమాకు ఉన్న ప్లస్, మైనస్ పాయింట్స్ ఇవే..

నందమూరి ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న 'దేవర' మూవీ ఫైనల్‌గా ఈ రోజు థియేటర్స్ లోకి వచ్చింది.

అర్థరాత్రి 1 గంట నుంచే బెన్‌ఫిట్ షోలు పడటంతో మూవీ టాక్, రివ్యూ బయటికి వచ్చేసింది.

ఈ మూవీలో ఉన్న ప్లస్ పాయింట్స్‌ను మైనస్ పాయింట్స్ ను ఇక్కడ చూద్ధాం...

సినిమాలో ఎన్టీఆర్ యాక్షన్ సీన్స్ చాలా బాగున్నాయి. రెండు పాత్రల్లో తారక్ తన మార్క్ ఫర్మామెన్స్‌ని చూపించాడు.

విజువల్స్‌తో పాటు రత్నవేలు ఫోటోగ్రఫి మెప్పించింది. సముద్రంలో యాక్షన్ సీన్స్ టైంలో కెమెరా పనితనం కనిపిస్తుంది.

విలన్‌గా సైఫ్ అలీ ఖాన్ మెప్పించాడు. అయితే, ఆయన నుంచి విలనిజాన్ని మరింత అంచనా వేశారు.

అనిరుధ్ అందించిన మ్యూజిక్‌కు సినిమాలో ప్రత్యేక స్థానం ఉంది. ఎన్టీఆర్ ఫ్యాన్స్‌ బాగా ఎంజాయ్ చేస్తారు.

అయితే కొరటాల శివ గారు స్క్రీన్ ప్లేని మరింత గ్రిప్పింగ్ రాసుకోవాల్సింది. సెకండాఫ్‌లో చాలా వరకు ల్యాగ్ అనిపిస్తుంది. వర పాత్రను చాలా వరకు ట్రిమ్ చేయాల్సింది అనే ఫీలింగ్ వస్తుంది.

హీరోయిన్ జాన్వీ కపూర్ తెలుగు డెబ్యూ వృథా అయిపోయింది. కథతో ఈమెకు ఎలాంటి ప్రాధాన్యత లేదు. అందాలను వెదజల్లడానికి ఒకరు కావాలి.. అది జాన్వీ అయింది. అంతకు మించి ప్రత్యేకత ఏం లేదు.

ఈ మూవీకి www.bigtvlive.com ఇచ్చే రేటింగ్ 2.5/5