సీతాఫలంతో ఆరోగ్య ప్రయోజనాలు

ప్రతీ సంవత్సరం ఆగస్టు, సెప్టెంబర్‌లో సీతాఫలాలు అందుబాటులోకి వస్తాయి. ఈ పండును దివ్యౌషధం అని పిలుస్తారు.

సీతాఫలాలు.. ఆరోగ్యానికి చాలా మంచిది. రుచితోపాటు పోషకాలు కలిగి ఉంటుంది.

సీతాఫలంలో మన బాడీలోని విషవ్యర్థాలను తరిమికొట్టే యాంటీఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి.

సీతాఫలాల్లో ఎంతో మేలు చేసే విటమిన్ సీ ఉంటుంది. పొటాషియం, మెగ్నీషియం వంటివి మన గుండెను కాపాడుతాయి.

బీపీని కంట్రోల్ చేసే శక్తి కూడా సీతాఫలాలకు ఉంది. గర్భిణులకు మంచిది.

ఈ పండ్లలోని విటమిన్ ఏ మన చర్మాన్ని, జుట్టును ఆరోగ్యంగా ఉంచుతుంది.

సీతాఫలంతో కంటి చూపు కూడా మెరుగవుతుంది. మలబద్ధకంతో బాధపడేవారు సీతాఫలం తింటే జీర్ణక్రియ బాగా అవుతుంది.

కీళ్లలోని యాసిడ్స్‌ని బయటకు తరిమేసి రుమాటిజం, కీళ్లనొప్పులకు చెక్ పెడుతుంది.

బరువు పెరగాలంటే కూడా సీతాఫలం చక్కటి పండు.

ఇందులోని విటమిన్ బీ6 ఆస్తమాకి చెక్ పెడుతుంది.