పీరియడ్స్ సమయంలో మహిళలు రక్తదానం చేయలేరనేది అపోహ మాత్రమే అని నిపుణులు అంటున్నారు. పీరియడ్స్ సమయంలో మహిళలు రక్తదానం చేయవచ్చు. కానీ దీనికి కొన్ని జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది.

పీరియడ్స్ సమయంలో రక్తస్రావం కారణంగా హిమోగ్లోబిన్ స్థాయి తగ్గవచ్చు. రక్తదానం చేసే ముందు, మహిళలు హిమోగ్లోబిన్ పరీక్ష చేయించుకోవాలి.

ఐరన్ హిమోగ్లోబిన్‌లోని ప్రధాన భాగం. స్త్రీలు తమ పీరియడ్స్ సమయంలో కొంత మేరకు ఐరన్ కోల్పోతారు కాబట్టి ఐరన్-రిచ్ ఫుడ్స్ తినడం వల్ల పెంపొందించుకోవచ్చు.

రక్తదానం చేసే ముందు ఆరోగ్య పరిస్థితి సరిగ్గా ఉందా లేదా అనేది చూసుకోవాలి.

పీరియడ్స్ సమయంలో అధిక రక్తస్రావం, తీవ్రమైన నొప్పి లేదా బాగా అలసిపోయినట్లు అనిపిస్తే, అప్పుడు రక్తదానం చేయవద్దు.