కర్పూరం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి.

కర్పూరంలో యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. ఇది ఇన్ఫెక్షన్లను నివారిస్తుంది.

కర్పూరంలో ఉండే సమ్మేళనాలు ఒత్తిడిని తగ్గించడంలో కూడా సహాయపడతాయి.

కర్పూరం నొప్పిని తగ్గించడంలో సహాయపడే అనాల్జేసిక్ లక్షణాలను కలిగి ఉంటుంది.

కర్పూరం నూనెతో కండరాల నొప్పితో పాటు కీళ్ల నొప్పుల నుంచి ఉపశమనం కలుగుతుంది.

కర్పూరంలో బ్యాక్టీరియా, వైరస్‌లు, ఫంగస్‌లను చంపే యాంటిసెప్టిక్ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి.

కాలిన గాయాలు, లేదా చిన్న చిన్న గాయాలపై కర్పూరం నూనెను పూయడం వల్ల ఇన్ఫెక్షన్ తగ్గుతుంది.

కర్పూరం నుంచి వచ్చే సువాసన ఒత్తిడిని తగ్గించడంలో సహాయపడుతుంది.

కర్పూరాన్ని వేడి నీటిలో వేసి ఆవిరి తీసుకోవడం వల్ల అనేక ప్రయోజనాలు ఉంటాయి.