మన శరీరానికి ప్రొటీన్ చాలా ముఖ్యం. శరీర పెరుగుదలకు, ఆరోగ్యంగా ఉండటానికి ఇది చాలా ముఖ్యం.

చాలా మంది  గుడ్లు ,చికెన్ మాత్రమే ఎక్కువ ప్రోటీన్ కలిగి ఉంటారని అనుకుంటారు, కానీ ఈ భావన పూర్తిగా తప్పు.

ప్రొటీన్ పుష్కలంగా ఉండే అనేక శాఖాహార ఆహారాలు  ఉన్నాయి. మరి అలాంటి 5 శాఖాహార ఆహారాల గురించి తెలుసుకుందాం.

పప్పులు: పప్పులు ప్రోటీన్ యొక్క అద్భుతమైన మూలం. ఇది శరీర పెరుగుదలకు ఎంతగానో ఉపయోగపడుతుంది.

సోయాబీన్: సోయాబీన్‌లో కూడా ప్రోటీన్ అధికంగా ఉంటుంది. ఇది కండరాలు సంక్రమంగా పని చేసేలా  చేస్తుంది.

బాదం: నట్స్ లో పోషకాలు అధికంగా ఉంటాయి. ముఖ్యంగా బాదంలో ప్రోటీస్ అధిక మోతాదులో ఉంటుంది.

పన్నీర్ :  పన్నీర్‌లో ప్రోటీన్ అధిక మొత్తంలో ఉంటుంది. తరుచుగా పన్నీర్ తినడం వల్ల అనేక  ప్రయోజనాలు ఉంటాయి.

బ్రౌన్ రైస్: వైట్ రైస్ కంటే బ్రౌన్ రైస్‌లో ఫైబర్ , ప్రొటీన్లు పుష్కలంగా ఉంటాయి.

బీన్స్ లో కూడా ప్రోటీన్ అధికంగా ఉంటుంది.

పుట్టగొడుగులు ప్రొటీన్ పుష్కలంగా ఉంటుంది.

వాల్‌నట్స్ లో ప్రొటీన్ అధిక మోతాదులో ఉంటుంది.