ఇండోర్ ప్లాంట్స్ ఇంటిని మరింత అందంగా కనిపించేలా చేస్తాయి. ఇండోర్ ప్లాంట్స్ వల్ల ఆరోగ్యానికి కూడా మేలు జరుగుతంది.

ప్రస్తుతం ఇండోర్ ప్లాంట్స్ పెంచడానికి  ఎక్కువ మంది మొగ్గు చూపుతున్నారు. ఇంటి చుట్టూ పచ్చదనం ఉంటే మనస్సు కూడా ప్రశాంతంగా ఉంటుంది.

ఇంటి మందు మొక్కలు పెంచడానికి ప్లేస్ లేని వారు హాల్, బాల్కనీల్లో మొక్కలు పెంచుకోవచ్చు.

ఇంట్లో  మొక్కలు పెంచడం వల్ల మాససిక ప్రశాంతతో పాటు వాస్తు కూడా కలసి వస్తుంది.

మనీ ప్లాంట్: వాస్తు ప్రకారం ఈ మొక్కను పెంచుకుంటే పేరుకు తగ్గట్లే ఇంట్లోకి సిరి సంపదలు వస్తాయి.

ఇంట్లో చిన్న పూల కుండీలను కొనుగోలు చేసి వాటిలో పూల మొక్కలు నాటితే బాగుంటుంది.

కలబందను ఇంట్లో పెంచుకోవడానికి ఎంతో మంది ఆసక్తి చూపిస్తుంటారు. దీంతో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉంటాయి.

ఫెర్న్ జాతి: కుండీల్లో పెంచుకునేందుకు అత్యంత అనువుగా ఉండే మొక్కల్లో ఫెర్న్ మొక్కలు ఒకటి .

స్నేక్ ప్లాంట్: ఈ మొక్కలు చూడటానికి అందంగా కనిపిస్తాయి. వీటిని టేబుళ్లపై, గదుల్లో టీపాయిలపై పెట్టకోవచ్చు.

బాంబూ పామ్: ఈ ప్లాంట్ అందమే వేరు. ఇంట్లో ఓ మూలన ఈ ప్లాంట్ పెడితే ఆ ప్రదేశానికి ఈ మొక్క మరింత లుక్ పెంచుతుంది.

జాడే ప్లాంట్: ఈ ఇండోర్ ప్లాంట్ చిన్న చిన్న ఆకులతో చేడటానికి చాలా ఆకర్షణీయంగా కనిపిస్తుంది.