కీర దోసతో శరీరానికి చలువ

కీరదోసలో కొవ్వు ఉండదు. కాబట్టి, గుండె జబ్బులు దూరంగా ఉంటాయి.

ఇందులోని పీచు పదార్థం జీర్ణ శక్తి పెంచడానికి తోడ్పడుతుంది.

నోటి దుర్వాసన పోగొట్టి తాజా శ్వాసను అందిస్తుంది.

బీపీ ఎక్కువ, తక్కువ అవుతున్నవారు దోస తింటే మంచిది.

కీర దోస శరీరానికి చలువ చేస్తుంది.

కీర దోస రసాన్ని తాగితే శరీర ఉష్ణోగ్రత అదుపులో ఉంటుంది.

శరీరంలోని విషతుల్యాలను పారదోలుతుంది.

కిడ్నీలో రాళ్లను కరిగించడంలో ప్రముఖ పాత్ర పోషిస్తుంది.

కళ్లపై కీర ముక్కలను కాసేపు పెట్టుకుంటే తాజాగా కనిపిస్తాయి.

చర్మానికి సహజ మాయిశ్చరైజర్‌గా పని చేస్తుంది.