ఆలు బుఖారా పండును డ్రై ఫ్రూట్స్‌గానూ తీసుకుంటారు. ఈ పండు కొంచెం పుల్లగా..కొంచెం తియ్యగా ఉంటాయి.

ఆలు బుఖారా పండ్లు తినడంతో గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. ఇందులో యాంటీ యాక్సిడెంట్లు అధికంగా ఉంటాయి.

ఈ పండులో ఫైబర్ సమృద్ధిగా లభిస్తుంది. ఇది కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గిస్తుంది. కాలేయం కొలెస్ట్రాల్ ఉత్పత్తి చేయకుండా ఆపుతుంది.

ఈ పండ్లలో లభించే బోరాన్ ఎముకల ఆరోగ్యాన్ని కాపాడటంలో కీలకంగా వ్యవహరిస్తుంది. ఇందులో అదనంగా ఫినాలిక్, ఫ్లేవనాయిడ్ రసాయనాలు ఉన్నాయి.

ఈ పండు రోగనిరోధక శక్తిని ఇవ్వడంలో సహాయపడుతుంది. సీజనల్ వ్యాధులు రాకుండా అడ్డుకుంటుంది.

ఆలు బుఖారా పండ్లు తీసుకోవడంతో చర్మం బిగుతుగా మారుతుంది. ముడతలని తగ్గిస్తుంది. చర్మం యవ్వనంగా కనిపించేలా చేస్తుంది.

 ఈ పండ్లలో ఉండే ఇసాటిన్, సార్బిటాల్.. మలబద్ధకాన్ని తగ్గించడానికి జీర్ణక్రియని మెరుగుపరచడంలో సహాయపడతాయి.

ఆలు బుఖారాలో ఫోలిక్ యాసిడ్ ఎక్కువగా ఉంటుంది. గర్భిణులకు ఇది చాలా మేలు చేస్తుంది.

ఈ పండు తీసుకుంటే జుట్టు రాలకుండా చేస్తుంది. చుండ్రు సమస్యను నివారిస్తుంది. జుట్టు కుదుళ్లు బలపడేందుకు సహాయపడుతుంది.

ప్రతి రోజు 3 లేదా 4 పండ్లు తీసుకోవడంతో అధిక రక్తపోటును నియంత్రిస్తుంది.