40 ఏళ్ల తర్వాత అంతరిక్షంలోకి భారత వ్యోమగాములు

అంతరిక్ష ప్రయోగాలు చాలా ఆసక్తికరంగా, సైన్స్‌పై ఇంట్రెస్ట్ కలిగించేలా ఉంటాయి.

యూఎస్‌లోని ప్రైవేటు స్పేస్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ సంస్థ ఆక్సియమ్ స్పేస్‌కు, ఇస్రోకు మధ్య ఓ డీల్ కుదిరింది.

ఇందులో భాగంగా భారత వ్యోమగాములను నాసా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి పంపిస్తున్నది.

ఇందుకోసం ప్రైమ్ పైలట్‌గా గ్రూప్ కెప్టెన్ శుభాంశు శుక్లా ఎంపికయ్యారు.

బ్యాకప్‌ పైలట్‌గా గ్రూప్ కెప్టెన్ ప్రశాంత బాలక్రిష్ణన్ నాయర్ ఎంపికయ్యారు.

ఆగస్టు తొలి (ఈ)వారంలోనే ఈ మిషన్ ఉండనుంది.

1984లో వింగ్ కమాండర్ రాకేశ్ శర్మ అంతరిక్షంలోకి వెళ్లారు.

అంతరిక్ష ప్రయాణం చేసిన తొలి భారతీయుడిగా రికార్డులకెక్కారు.

అప్పుడు రష్యా మిషన్‌లో భాగంగా రాకేశ్ శర్మ స్పేస్ వెళ్లారు.

ఇప్పుడు 2024లో అమెరికా మిషన్‌లో భాగంగా శుక్లా, నాయర్‌లు వెళ్లుతున్నారు.