స్నేహ గురించి తెలుగువారికి పరిచయం చేయాల్సిన అవసరం లేదు

స్నేహ అసలు పేరు సుహాసిని. చిన్న చిన్న పాత్రలు చేస్తూ కెరీర్ ను మొదలుపెట్టింది 

ప్రియమైన నీకు అనే సినిమాతో హీరోయిన్ గా పరిచయమైంది

తొలివలపు, హనుమాన్ జంక్షన్ లాంటి సినిమాల్లో నటించి మెప్పించింది 

వెంకీ సినిమాతో స్నేహ స్టార్ హీరోయిన్ గా మారింది 

శ్రీరామదాసు, రాధా గోపాలం లాంటి సినిమాలు స్నేహకు మంచి పేరు తెచ్చిపెట్టాయి

నిండైన చీరకట్టుతో కనిపించే స్నేహ తెలుగువారికి దగ్గరయింది. ఎలాంటి గ్లామర్ రోల్స్ చేయకుండా పాత్రకు ప్రాధాన్యత ఉన్న సినిమాలను ఎంచుకొని మెప్పిస్తుంది

కెరీర్ పీక్స్ లో ఉన్నప్పుడే నటుడు ప్రసన్నను పెళ్ళాడి సినిమాలకు కొంత గ్యాప్ ఇచ్చింది స్నేహ 

ప్రస్తుతం రీఎంట్రీలో తమిళ్ లో విజయ్ సరసన ది గోట్ సినిమాలో నటిస్తుంది

ఇక నిత్యం సోషల్ మీడియాలో తన ఫొటోలతో అభిమానులను అలరించే స్నేహ.. తాజాగా చీరకట్టులో ఉన్న ఫోటోలను షేర్ చేసింది 

గ్రీన్ అండ్ మెరూన్ కలర్ చీరలో అచ్చతెలుగు ఆడపడుచులా కనిపించింది. ఇక గోల్డ్ ఆభరణాలు ఆమె అందానికి మరింత వన్నెను తెచ్చాయి

ప్రస్తుతం స్నేహ ఫోటోలు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి