రూ.10 లక్షల లోపు ధర కలిగిన పెట్రోల్ కార్లను కొనుక్కోవాలనుకుంటే మారుతి కార్లు అందుబాటులో ఉన్నాయి.

మారుతి సుజుకి ఆల్టోకె 10ను తక్కువ ధరకే కొనుక్కోవచ్చు. ఇందులో ఆటోమేటిక్ వేరియంట్ లీటర్‌కు 24.9 కిమీ మైలేజీని అందిస్తుంది.

మ్యాన్యువల్ వేరియంట్ లీటర్‌కు 24.39 కిమీ మైలేజీని ఇస్తుండగా.. రూ.4 లక్షల ప్రారంభ ధరతో లభిస్తుంది.

మారుతి సుజుకి సెలెరియో పెట్రోల్ వేరియంట్ లీటరుకు 25 కిమీ.. ఆటోమేటిక్ వేరియంట్ లీటరుకు 26 కిమీ వరకు మైలేజీని ఇస్తుంది.

సెలెరియో ఎక్స్-షోరూమ్ ధర రూ.5.36 లక్షల నుండి రూ.7.10 లక్షల మధ్య ఉంది.

మారుతి సుజుకి ఎస్-ప్రెస్సో ఆటోమేటిక్ వేరియంట్‌ లీటరుకు 25.3 కిమీ, మాన్యువల్‌లో లీటరుకు 24.76 కిమీ మైలేజీని ఇస్తుంది.

ఎస్ప్రెస్సో ఎక్స్-షోరూమ్ ధర రూ.4.26 లక్షల నుండి రూ.6.11 లక్షల మధ్య ఉంది.

మారుతి సుజుకి వ్యాగన్ ఆర్ మాన్యువల్ లీటరుకు 24.35 కిమీ, ఆటోమేటిక్ లీటరుకు 25.19 కిమీ మైలేజీని ఇస్తుంది. దీని ప్రారంభ ధర రూ.5.54 లక్షలు

మారుతి నాల్గవ తరం Maruti Swiftను భారత మార్కెట్లో విడుదల చేసింది. ఆటోమేటిక్ వేరియంట్‌లో లీటరుకు 25.75 కిమీ అందిస్తుంది.

మాన్యువల్‌లో లీటరుకు 24.8 కిమీ మైలేజీని ఇస్తుంది. దీని ప్రారంభ ధర రూ.6.50 లక్షలు.

మారుతి సుజుకి డిజైర్ మాన్యువల్ లీటరుకు 23.26 కిమీ, ఆటోమేటిక్ లీటరుకు 23.69 కిమీ మైలేజీని ఇస్తుంది. ప్రారంభ ధర రూ.6.56 లక్షలు.

మారుతి సుజుకి బాలెనో మాన్యువల్‌ లీటరుకు 22.35 కిమీ, ఆటోమేటిక్ లీటరుకు 22.94 కిమీ మైలేజీని ఇస్తుంది. ధర రూ.6.66 లక్షలు.

మారుతి సుజుకి ఫ్రాంక్స్ మాన్యువల్ వేరియంట్ 21.79 కి.మీ, ఆటోమేటిక్ 22.89 కి.మీ మైలేజీని ఇస్తుంది. ధర రూ.7.51 లక్షలు.