క్రీ.పూ 4 శతాబ్దానికి చెందిన గ్రీకు తత్వవేత్త సోక్రటీస్. ఇప్పటికీ ఆయన ఆలోచనలు రిలవెంట్‌గానే ఉన్నాయి.

మీ మైండ్‌ను షార్ప్ చేసే పది సోక్రటీస్ కోట్స్..  వాటి వివరణలు మీ కోసం.

మీకు ఏమీ తెలియదని తెలుసుకోవడమే అసలైన జ్ఞానం. కొత్త విషయాలు తెలుసుకోవడానికి, వినయంగా ఉండటానికి ఈ కోట్ ఉపయోగపడుతుంది.

మిమ్మల్ని మీరు తెలుసుకోండి. మిమ్మల్ని మీరు అర్థం చేసుకుని మోటివేట్ చేసుకోవడానికి మీ బలాలు, బలహీనతలు తెలుసుకోవడం అవసరం.

విజ్ఞులు ఆలోచనలను చర్చిస్తారు. మందబుద్ధులు వ్యక్తుల గురించి చర్చ చేస్తారు. చిన్నా చితక విషయాలకు సమయాన్ని, మేధస్సును ఖర్చు పెట్టకుండా ఈ కోట్ నివారిస్తుంది.

ప్రతి ఒక్కరు వారి వారి యుద్ధాల్లో మునిగి ఉంటారు.  కాబట్టి క్షమగా మెలగండి. ఇది ఆచరిస్తే.. కరుణతో మెలగడం వల్ల పాజిటివ్ రిలేషన్‌షిప్స్ డెవలప్ అవుతాయి.

విద్యా.. ఖాళీ డబ్బాను నింపేది కాదు, కాగడా నుంచి వచ్చే వెలుతురు. విద్య, క్రిటికల్ థింకింగ్ యొక్క గొప్పదనాన్ని ఇది వివరిస్తుంది.

ఎలాంటి పరీక్ష ఎదుర్కోని జీవితం విలువైంది కాదు. ఆత్మ పరిశీలన చాలా ముఖ్యమని సోక్రటీస్ భావించారు.

నాకు తెలిసిందల్లా నాకేమీ తెలియదనే. ఇది జీవితాంతం జిజ్ఞాసను నిలిపి ఉంచుతుంది.

అతిగొప్ప సంపద ఆరోగ్యమే. మీ లక్ష్యాలను సాధించడానికి, జీవితాన్ని సార్థకం చేసుకోవడానికి శారీరక, మానసిక ఆరోగ్యం అవసరం.

బిజీ జీవితపు మోడుతనాన్ని గుర్తించి జాగ్రత్త వహించు. మనం చేసిన పనులు, మన అనుభవాలు ఎన్ని అనేది కాదు, ఎంత నాణ్యమైనవనేవి ముఖ్యమని ఈ కోట్ తెలియజేస్తుంది.